వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:VP
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..



విషయ సూచిక

తెలుగును వ్రాసే విధానం[మార్చు]

ఇప్పుడు తెలుగు రాసే విధానంలో ఎన్నో మార్పులు వచ్చినా మనం ఇంకా RTS పద్ధతిలోనే వికీలో రాసే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం.ఇది గూగూల్ వాయిస్ సహాయంతో మాటను అక్షరాలుగా మార్చి రాసినది అలాగే Google Telugu Input tool నాణ్యత కూడా పెరిగింది,కాబట్టి కోత్త వాడుకదారులకు మిగిలిన వాటితో పాటు ఈ గుగూల్ టూల్స్ మీద,మోబైల్ ద్వారా ఎడిటింగ్ మీద శిక్షణ ఇవ్వాలి అని నా అభ్యర్థన . కశ్యప్

అవును కశ్యప్ గారు. ఇప్పటివరకు మనం కంప్యూటర్ లో వికీ రాయడం గురించే శిక్షణ ఇస్తున్నాం. ఇక మోబైల్ ద్వారా ఎడిటింగ్ మీద శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:39, 19 మే 2018 (UTC)

ప్రాజెక్టు టైగర్ పోటీ కోసం స్థానిక అంశాలు[మార్చు]

ప్రాజెక్టు టైగర్ పోటీ కోసం స్థానిక ప్రాధాన్యత గల అంశాల జాబితా తయారైంది. ఇందులో 494 పేజీలున్నాయి - కొన్ని కొత్తగా తయారు చెయ్యాల్సినవి (ఇంగ్లీషు వికీ లింకులు), కొన్ని విస్తరించాల్సినవీ (తెలుగు లింకులు). వాడుకరులు ఈ జాబితాలోని వ్యాసాలలోనూ కృషి చెయ్యవచ్చు. నియమాలు మామూలే. __చదువరి (చర్చరచనలు) 16:24, 2 మే 2018 (UTC) ఒక గమనిక: ఇంగ్లీషు లింకులు ఉన్నవాటికి తెలుగు వ్యాసాలు ఉండే అవకాశం ఉంది. వాడుకరులు ఒకసారి చూసుకోవాలని మనవి. __చదువరి (చర్చరచనలు) 16:27, 2 మే 2018 (UTC)

ఆర్కీవ్.ఆర్గ్ లో DLI పుస్తకాలు వివరాలు తెలుగులో తాజా[మార్చు]

ఆర్కీవ్.ఆర్గ్ లో DLI తెలుగు పుస్తకం "తెలుగు భాషా చరిత్ర"

"తెలుగు సమాచారం అందుబాటులోకి" ప్రాజెక్టు ఫలితాలు ఆర్కీవ్.ఆర్గ్ లో DLI తెలుగు పుస్తకాల తాజా ప్రారంభమైంది. దీనివలన తెలుగు వాడుకరులు శోధన యంత్రాల ద్వారా 5884 తెలుగు పుస్తకాలకు చేరుకుంటారు. మరిన్ని సంబంధిత తెలుగు పుస్తకాలను చూడగలుగుతారు. వికీమీడియా ఫౌండేషన్ వారి సహాయంతో తెలుగు కేటాలాగ్ ప్రాజెక్టు చేసిన వాడుకరి:Pavan santhosh.s మరియు జట్టుకు, డిఎల్ఐ పుస్తకాలను ఆర్కీవ్.ఆర్గ్ లో భద్రపరచటానకి కృషిచేసిన పబ్లిక్ రిసోర్స్ సంస్థ అధిపతి కార్ల్ మలమూద్ కు ధన్యవాదాలు. మరిన్ని వివరాలు.వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI final catalogue, ఉదాహరణ పుస్తకం చూడండి. సహ వికీపీడియన్లు ఆసక్తి గనబరిచితే మిగతా 75% శాతం పుస్తకాల వివరాలు తెలుగులోకి మార్చే కృషి చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 23:45, 2 మే 2018 (UTC)

తెవికీ మూసలకు దగ్గరి దారి బొత్తాంలు వికీ ఎడిటర్ లో char-insert gadget తో చేతనం[మార్చు]

తెవికీ మూసల బొత్తాంలు char-insert gadget తో పనిచేయటం

మనం ఇంతకు ముందు వాడే {{సహాయం కావాలి}} లాంటి మూసల బొత్తాంలు కొత్త వికీ ఎడిటర్ తో చేతనం చేశాను.ఇవి సవరణ పెట్టె పాఠ్య భాగానికి, మరియు మార్పులను ప్రచురించు విభాగానికి మధ్య Wiki markup అనే ఎంపిక జారుడుమెనూలో కనబడతాయి. ఇప్పడు తెలుగు వికీ సవరణ సౌకర్యాలు ఆంగ్ల వికీ లాగా వుంటాయి. మరిన్ని వివరాలకు http://phabricator.wikimedia.org/T192246 చూడండి. --అర్జున (చర్చ) 07:19, 3 మే 2018 (UTC)

AdvancedSearch[మార్చు]

Birgit Müller (WMDE) 14:53, 7 మే 2018 (UTC)

2018 మే నెలలో చేపడుతున్న కార్యకలాపాల జాబితా[మార్చు]

అందరికీ నమస్కారం,
మే నెలలో సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళిక అమలు విషయమై చేపడుతున్న కార్యకలాపాల జాబితా సముదాయ సభ్యులు ఇక్కడ చూడవచ్చు, గత నెలలో ప్రతిపాదించిన పనులు వాటి పురోగతి ఇక్కడ చూడవచ్చు. దయచేసి వికీపీడియన్లు పరిశీలించాల్సిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 09:28, 10 మే 2018 (UTC)

ఆర్కీవ్ డాట్ ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల వివరాలు ఆంగ్లలిపినుండి తెలుగులోకి మార్చుటకు సహాయం.[మార్చు]

user:Pavan santhosh.s నాయకత్వం వహించిన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ఫలితాలనుండి తెలుగు 5844 పుస్తకాల వివరాలను ఆర్కీవ్.అర్గ్ లో చేర్చాను.(మార్చిన తరువాత కనబడే పుస్తకం ఉదాహరణ). ఇంకా 17062 పుస్తకాల వివరాలను తెలుగులోకి మార్చితే విలువైన తెలుగు పుస్తకాలు తెలుగు వారికి అందుబాటులోకి వస్తాయి. దానికొరకు ప్రయోగాత్మకంగా తెలుగులోకే మార్చే సాఫ్ట్వేర్ తో యాంత్రిక లిప్యంతరీకరణ సలహాలను చేర్చిన గూగుల్ షీట్ మీతో పంచుకుంటున్నాను. ఆంగ్లఅక్షరాలతో రాసిన మూలంలో కోడ్ సరిగా వాడకపోవడంతో యాంత్రిక లిప్యంతరీకరణ నేరుగా వాడలేకపోతున్నాము. దానిలో ఆకుపచ్చ రంగులో వున్న ntitle, nauthor అనే నిలువ వరుసలో ptitle, pauthor లో ప్రశ్నార్ధకంతో మొదలయ్యే వరుసలోని ఆర్కీవ్.ఆర్గ్ లింకు నొక్కి పుస్తకం తొలి పేజీలు చూసి, పుస్తకం శీర్షిక,రచయిత,ఆనువాదం, సంపాదకుల వివరాలు చేర్చాలి. ఇంకా పుస్తక ప్రచురణ సంవత్సరం సరిగా లేకపోతే pdateలో , అది తెలుగు భాషకు కాని పుస్తకం అయితే ఆ భాష కోడ్(tam tel లేక Unknown) అనేది nslang వరుసలో చేర్చాలి. ఒక అంశం దిద్దినపుడు ptitle, pauthor వరుసలో ఆ అంశం తాలూకు మొదటి అక్షరం ప్రశ్నార్ధక చిహ్నాన్ని తొలగించండి. దానితో ఇంకా చేయవలసిన అంశాల సంఖ్యలు మొదటి వరుసలోవి తాజా అవుతాయి. మీకేదైనా సందేహాలుంటే తెలపండి. తెలుగులో మంచి విలువైన పుస్తకాల వివరాలు తెలుసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. వికీసోర్స్ లో పని చేసిన రోజున 15 నిముషాలు కేటాయించగలిగితే 10 పుస్తకాల వరకు వివరాలు చేర్చగలుగుతారు. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమం పూర్తిచేయటానికి సహకరించవలసింది. వికీసోర్స్ లో కాకుండా గూగుల్ షేర్ లో ఈ పని చేయడానికి మెరుగైన సౌలభ్యం కాబట్టి అలా చేయడమైనది. మీకు గూగుల్ లో తెలుగు టైపు చేయడానికి సమస్య ఏమైనా వుంటే సంప్రదించండి. మీ ఆసక్తి మరియు స్పందనలు తెలియచేయవలసినది.--అర్జున (చర్చ) 07:17, 12 మే 2018 (UTC)

అర్జున గారూ మీ ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. గూగుల్‌లో తెలుగు పుస్తకాల పేర్లతో వెతికేవారికి ఆర్కైవ్‌లో నేరుగా లంకె దొరికేస్తుందిక! ఆరువేల పుస్తకాల వివరాలకు మరింత సార్థకత చేకూర్చినందుకు మీకు తెలుగు సమాచరం అందుబాటులోకి ప్రాజెక్టు బృందం తరఫున ధన్యవాదాలు. ఇక మిగతా 17వేల పైచిలుకు పుస్తకాల సంగతికి వస్తే, నేను, చదువరి గారూ గ్రామాల వ్యాసాల పేర్లను గ్రామ వ్యాసాల్లో సమాచారం చేర్చేందుకు ఆంగ్లంలోంచి లిప్యంతరీకరించిన పద్ధతి కొంతమేరకు ఉపకరిస్తుందని భావిస్తున్నాను. ఈ పద్ధతి ప్రకారం ముందు సాధారణంగా మరిమరి వచ్చే కొన్ని పదాలను Replace చేస్తూ పోవాలి. గ్రామాల విషయమై ఉదాహరణ కావాలంటే pur > పూర్, bad > బాద్ ఇలాగన్నమాట. అలా తరచు వచ్చే స్ట్రింగ్స్ గమనించి చేస్తే సగం పనివరకూ పూర్తవుతుంది. తర్వాత మిగిలిన పని విషయమై ఒక్కోదాని మీదా ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. ఈ సూచనలపై మీ ఉద్దేశం ఏమిటో చెప్పగలరు. అసలు పుస్తకాల విషయంలో ఈ పద్ధతే పనికిరాదనుకుంటే మీరన్నట్టే మానవీయంగా చేసుకుందాం. ఒక్కో పేజీ తప్ప తెరుచుకోని డీఎల్ఐలోనే సమర్థవంతంగా పనిచేసినవాళ్ళం కాబట్టి నేరుగా అన్ని వివరాలు తెరిచి చూడగల ఆర్కైవులో పని మరింత సులభం కాగలదనే భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:09, 12 మే 2018 (UTC)
పవన్ సంతోష్ గారి స్పందనకు ధన్యవాదాలు. ఇప్పటికే లిప్యంతరీకరణ సాఫ్ట్వేర్ డిఎల్ఐ కోడ్ IT3 ప్రకారం తయారు చేశాను. కాని మూలంలో ఆ కోడ్ వాడుక సరిగాలేకపోవటంతో ఉపయోగం లేకుండా పోయింది.కాకపోతే గూగుల్ షీట్ లోని సౌలభ్యాలతో మరియు ఆర్కీవ్ వెెబ్సైట్ వాడకరులకు అనువుగావుండండంతో ఈ పనికి పెద్ద సమస్యలు లేవు. కేవలం. ఆసక్తిగల వారు ఎక్కువగా పాల్గొనడమే కావలసినది.--అర్జున (చర్చ) 10:31, 14 మే 2018 (UTC)
గూగుల్ తెలుగు ద్వారా తెలుగు లొ వివరాలు బాగానే మారుతున్నయ్, ప్రయత్నిస్తాను , ఇది ఛ్హుడండి Kasyap (చర్చ) 17:59, 1 జూలై 2018 (UTC) https://translate.google.com/#auto/te/Sri%20Madhguru%20Bhabavatham%20Ekadhasha%20Dhwadhasha%20Skandhamulu%0ASri%20Madramayana%20Anthergatha%20Ayodhya%20Kandam%20Andhra%20Tathparya%20Saiththam
Kasyap గారికి, మీరు పై వ్యాఖ్యని హాస్యంగా జోడించారని అనుకుంటాను.--అర్జున (చర్చ) 05:34, 5 జూలై 2018 (UTC)
అర్జున రావు గారూ, క్షమించాలి, మీరు మే లో పంపించిన సందేశం ఇప్పుడే కనబడింది. నేను ఈ ప్రాజెక్టులో సహాయ పడదామనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అనుకుంటున్నాను. రోజుకు కొంత సమయం కేటాయించి గూగుల్ షీట్ లో ntitle, nauthor నిలువ వరుసలో సమాచారం నింపగలను. ఈ గూగుల్ షీటు పూర్తిగా నిండిన తర్వాత ఈ సమాచారం ఎక్కిడికి వెళుతుంది? పూర్తిగా నిండిన తర్వాతే వెళుతుందా లేదా మనం సమాచారం చేర్చినది చేర్చినట్టు అంతర్జాలం లోకి వెళ్ళే సౌలభ్యం ఉందా? రవిచంద్ర (చర్చ) 11:47, 2 జూలై 2018 (UTC)
రవిచంద్ర గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. నెలకొకసారి పూర్తయిన పనిని ఆర్కీవ్.ఆర్గ్ లో చేర్చడానికి, ఈ పుస్తకాల నిల్వదారు ఒప్పుకున్నారు. మానవీయంగా చేయటానికి చాలా సమయం కావాలి కాబట్టి, వాడుకరి:Chaduvari కొంతమేరకు కంప్యూటర్ సహకారంతో త్వరలో చేద్దామనుకుంటున్నాను. ఆ తరువాత వీటిని పుస్తకపు లింకు తెరిచి తనిఖీ చేయాలి. దీనికి సహాయం చేస్తున్నావారందరితో తాజా విషయాలు ఈ మెయిల్ ద్వారా పంచుకుంటాను.అర్జున (చర్చ) 05:33, 5 జూలై 2018 (UTC)

నాకు అర్థం కాలేదు[మార్చు]

వాడుకరులకు నమస్కారము. ఈ పనిలో ఒక వాడుకరిగా ఏమి చేయాలో నాకు అర్థం కాక అడుగుతున్నాను. నాకు తర్జుమాలు పనులు నిజానికి బాగా ఇష్టం ఉన్నా, అవి అన్నీ ఏమి చేయాలో తెలియక నేను పాల్గొనడము లేదు. దయచేసి అసలు ఉన్న పని ఏమిటి, దానిని తెలుగులోకి ఏమి మార్చాలో ఒక ఉదాహరణగా వివరంగా చూపించి వ్రాయండి. JVRKPRASAD (చర్చ) 01:47, 2 జూలై 2018 (UTC)

JVRKPRASAD గారికి, ఆంగ్ల లిపిలో వున్న పుస్తకపు పేరు, రచయిత పేరు, తెలుగు లిపిలో చేర్చాలి. గూగుల్ షీట్ లో ఆంగ్ల లిపి లో పుస్తకపు వివరాలు, పుస్తకానికి లింకు, కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా లేక ఇప్పటికే DLI ప్రాజెక్టు ద్వారా తెలుగు లిపిలో పుస్తకపు వివరాలు, వాటిని సరిచేసి రాయటానికి వేరే నిలువ వరుసలు వున్నాయి. ఒకటి రెండు వరుసలు చదివితో సులభంగా అర్ధంచేసుకోవచ్చు. అర్జున (చర్చ) 05:40, 5 జూలై 2018 (UTC)
అర్జున గారు, మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 14:38, 5 జూలై 2018 (UTC)

ఇండియా ఐఆర్సీలో చేరగలరు[మార్చు]

ఈరోజు (అంటే 2018 మే 12న) రాత్రి 8 గంటలకు భారతదేశ వ్యాప్తంగా వికీమీడియా అంశాలను చర్చించేందుకు భారత ఐఆర్సీ జరగనుంది. http://webchat.freenode.net/?nick వెబ్ వెర్షన్‌కు చేరుకుని మీ పేరు లేక మీ నిక్‌నేమ్ Nickname వద్ద రాసి, ఛానెల్ అన్నదగ్గర #cis-a2k అన్న చానెల్ పేరు చేర్చి ఈ ఐఆర్సీలో చేరవచ్చు. తెలుగు వికీమీడియన్లు దయచేసి చేరతారని ఆశిస్తూన్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:46, 12 మే 2018 (UTC)

రచ్చబండ - పాలసీలు వద్ద శైలీపరమైన చర్చ[మార్చు]

రచ్చబండ పాలసీలు వద్ద అతడు-అతను అన్న విభాగంతో "అతడు" అన్న ప్రయోగం చేయాలా, "అతను" అన్న ప్రయోగాన్ని స్వీకరించాలా అన్న అంశంపై శైలీపరమైన చర్చ ప్రారంభించాను. దయచేసి సభ్యులు చర్చించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:51, 13 మే 2018 (UTC)

" ఆయన " అన్న ప్రయోగం చేస్తే బాగుంటుందేమో ! T.sujatha (చర్చ) 12:14, 14 మే 2018 (UTC)
సుజాత గారూ! మీ అభిప్రాయాన్ని రచ్చబండ పాలసీలులో అతడు-అతను అన్న విభాగంతో చేరుస్తున్నాను. ఇక ఈ చర్చను ఎవరైనా ఇక్కడే చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:47, 14 మే 2018 (UTC)

తెలుగు వికీపీడియా దశ-దిశ కాన్ఫరెన్సు ప్రతిపాదన[మార్చు]

అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియా దశ తెలుసుకునేలా, తద్వారా తెవికీ నాణ్యత తెలిసేలా "తెలుగు వికీపీడియా దశ-దిశ" పేరిట కార్యక్రమాన్ని రూపొందించేందుకు ప్రతిపాదిస్తున్నాం. తెలుగు వికీపీడియన్లు, బయటి రంగాల నిపుణులు(రచయితలు, సంపాదకులు, జర్నలిస్టులు, చరిత్రకారులు, విజ్ఞానశాస్త్ర రచయిలు, సాంకేతిక రంగ రచయితలు, కాలమిస్టులు, వగైరా) పాల్గొంటారని ప్రతిపాదన. దీని వల్ల మూడు ప్రయోజనాలను లేక లక్ష్యాలను ఉద్దేశిస్తూ ప్రతిపాదిస్తున్నాం.

  1. మదింపు: తెలుగు వికీపీడియా ప్రస్తుత స్థితి ఏమిటన్నది బయటి నిపుణులకు కొన్ని నమూనా వ్యాసాలు (రీడింగ్ లిస్టు), తెలుగు వికీపీడియా చరిత్ర-తెలుగు వికీపీడియన్లు చేసిన ప్రయత్నాలు వంటివాటి ఆధారంగా నాణ్యత, వైవిధ్యం, అవసరమైన సమాచారం, విస్తృతి వంటివి పరామితులుగా పెట్టుకుని మదింపు వేసి, మన, వారి మదింపు ఆధారంగా చర్చలు, ప్రెజంటేషన్లు, ప్రసంగాల వంటివి జరుగుతాయి. గతంలో మనం చేసిన ప్రాజెక్టులు, ప్రయత్నాలను కూడా మనం నిష్పాక్షికంగా అంచనా వేసుకుని వికీపీడియన్లలో కొందరు వాటి ఫలితాలు, వాటి నుంచి నేర్చుకున్నవి వంటివి మదింపు వేసేలా ప్రెజంట్ చేయడమూ జరుగుతుంది.
  2. ప్రదర్శన: ఒక సమిష్టి కృషిగా, తెలుగు భాషకు, తెలుగునాట విజ్ఞానవ్యాప్తికి తెలుగు వికీపీడియన్లు చేసిన ప్రయత్నాలు, దాని ఫలితాలు విస్తృతమైన తెలుగు రంగానికి చూపించేందుకు ఇదొక వేదికగా ఉపయోగించవచ్చని రెండో ప్రతిపాదన. ఇదే వేదికగా తెలుగు భాషకు తెలుగు వికీమీడియా ప్రాజెక్టులు చేసిన కృషి, భవిష్యత్తులో చేయదలుచుకున్న ప్రయత్నాలపై ఒక చక్కని పుస్తకాన్ని రూపొందించి విడుదల చేయడం మన ప్రయత్నాలకు వన్నెతెస్తుందని ఆశిస్తున్నాం.
  3. నేర్చుకోవడం-పంచుకోవడం: పలు రంగాల్లో ఇప్పటికే కృషిచేస్తున్నవారిని పిలిచి మన సమస్యలు, మనం సాధించిన విజయాలు చర్చిస్తూండగా వారి నుంచి మంచి పద్ధతులు మనం నేర్చుకోవడం, మన నుంచి మంచి విధానాలు వారు స్వీకరించడం, మొత్తానికి ఒక భాగస్వామ్య ప్రయత్నాలకు వీలు కలగడం జరుగుతుందని భావిస్తున్నాం. ఈ విధంగా నేర్చుకోవడం, పంచుకోవడం దీనికి మూడో, మౌలిక లక్ష్యంగా ప్రతిపాదిస్తున్నాం.

ఇది తెలుగు వికీపీడియన్లు పెద్ద ఎత్తున హాజరైన గత వార్షికోత్సవాల స్థాయిలో చేస్తూనే, ఇతర రంగాల ప్రముఖులను, నిపుణులను ఆహ్వానించి విశిష్టమైన ప్రయత్నంగా చేయాలని ఆలోచన. తెలుగు వికీపీడియన్ల ముందు ఈ ప్రతిపాదనను ఉంచేప్పుడు ప్రతిపాదనగానే ఉంచుతున్నామని, దానిని వికీపీడియన్లు చర్చించి, మెరుగుపరిచి మరే రూపొన్నైనా సంతరించేలా చేయడానికి వీలుందని తెలియజేస్తున్నాం. ఈ ప్రతిపాదనపై చర్చించడమే కాక నిర్వహణా సాధ్యమైన ప్రతిపాదన అనీ, నిర్వహించడం తెవికీకి అంతిమంగా మేలుచేస్తుందనీ భావించినట్టైతే నిర్వహణలోనూ ముందుండి నడిపించమని మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 05:44, 14 మే 2018 (UTC)

పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) గారు "తెలుగు వికీపీడియా దశ-దిశ" పేరిట మంచి కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. కార్యక్రమ లక్ష్యాలు కూడా బాగున్నాయి. గత మూడు సంవత్సరాలుగా మనం అందరం కలిసే పెద్ద కార్యక్రమేది జరగలేదు. గతంలో కంటే ప్రస్తుతం వికీపీడియా గురించి చాలామందికి తెలిసింది, ఇటువంటి సమయంలో మనం ఇంకా జనం దృష్టిని ఆకర్షించడం కూడా చాలా ముఖ్యమని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:28, 18 మే 2018 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె)) గారూ! మీ ప్రతిపాదన బాగుంది. నేను 25-05-2018 నుండి ఇండియాలో ఉండను కనుక సమావేశంలో పాల్గొనలేను. 15-10-2018 పైన అయితే పాల్గొనగలను. అయినప్పటికీ కార్యవర్గ సభ్యత్వం ద్వారా గతంలో చేసినట్లు అవసరమైన సహాయం అందించగలను.T.sujatha (చర్చ) 16:04, 24 మే 2018 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె)) గారికి. గత కొన్ని నెలలుగా వీకీప్రాజెక్టుల పురోగతి గమనిస్తున్నప్పుడు నాకు అనిపించేదేమంటే,చదువరులు పెరుగుతున్నా క్రియాశీలక సంపాదకులు పెరగడంలేదు. ఒక్క వికీ గ్రామాల ప్రాజెక్టు తప్పిస్తే సమిష్టి కృషికి తార్కాణాలులేవు.ఇటీవలి ప్రాజెక్టు టైగర్ కూడా వ్యక్తిగత కృషిని అభివృద్ధి చేయడం లక్ష్యంగా రూపొందినదే. రాష్ట్ర స్థాయి వ్యాసాలలో మార్పులకు కూడా సహకారం కనబడుటలేదు. తెలంగాణా వ్యాసాన్ని అభివృద్ధి చేయ‍డానికి సహాయం కోరినా స్పందనలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిట్ట, పూవు మార్పులు జరిగినా రెండ‍ువారాలు పైగా ఎవరూ మార్పులు చేయలేదు. ఇతర సంస్థలతో భాగస్వామ్యాలు వికీకి అంత ఉపయోగపడలేదు. ఈ సందర్భంలో పెద్ద ఆశయాలతో కార్యక్రమాలు చేపట్టటంకంటే క్రియాశీలంగా వున్న సభ్యుల ఆసక్తులని పరిగణించి వీలైనంతవరకు సమిష్టి ప్రాజెక్టులలో కృషి పెరిగేలాగా చిన్న కార్యక్రమాలు,సమావేశాలు చేపట్టటం మంచిది.--అర్జున (చర్చ) 09:02, 12 జూన్ 2018 (UTC)
అర్జున గారూ, నమస్తే. ప్రాజెక్టు టైగర్ మీరన్నట్టు సమిష్టి కృషికి నేరుగా సాయం చేసేది కాదు, కానీ విమర్శలను స్వీకరించడానికి, తమ శైలిని వికీపీడియా శైలికి తగ్గట్టు దిద్దుకోవడం వంటి సమిష్టి కృషికి మౌలికమైన అంశాలు పెంపొందించేలా సాగిందనే భావిస్తున్నాను. ఎన్ని మార్పులు చేశారన్న ప్రశ్న నుంచి ఎన్ని వ్యాసాలు సృష్టించారన్న ప్రశ్నకు సాగిన సామూహిక ప్రోత్సాహక దృష్టిని, ఇది ఎన్ని వ్యాసాలను అభివృద్ధి చేశారన్న వైపుకు తీసుకుపోతోందనే భావిస్తున్నాను. పోటీలో కొత్త వ్యాసాలు రాసినవారే కాక ఇప్పటికే ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేసినవారూ పరిగణించదగ్గ మంది ఉండడం కూడా ప్రోత్సాహకరమే. అయితే అన్ని ప్రాజెక్టులూ నేరుగా అన్ని ఆశయాలనూ లక్ష్యం చేసుకోలేవు కనుక ఇప్పటికే మన మొదటి పేజీలో ప్రదర్శించిన వ్యాసాలలో ఉన్న సమస్యలను గుర్తింపజేసి (వారు సృష్టించినవి కావు కాబట్టి వ్యక్తిగత కృషి నుంచి సమిష్టి వైపుకు ఒక అడుగు అవుతుందని భావిస్తున్నాను) వాటిని మెరుగుపరిచేలా ఓ ఎడిటథాన్ రూపొందిస్తున్నాం. తద్వారా ఎవరు సృష్టించిన వ్యాసాలు వారే అభివృద్ధి చేసుకునే ధోరణి ఎక్కడైనా ఉన్నా దానిని ఈ ప్రయత్నం తగ్గిస్తుందని ఆశిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 09:25, 23 జూన్ 2018 (UTC)

స్వేచ్ఛ, గచ్చిబౌలి కార్యాలయంలో కలవవచ్చు[మార్చు]

అందరికీ నమస్కారం,
నేను ఆఫీసువేళల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సర్కిల్ వద్ద స్వేచ్ఛ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నాను. బయటి అపాయింట్‌మెంట్లు, మీటింగులు, కార్యశాలలు వంటివి లేని సమయాల్లో స్వేచ్ఛ ఆఫీసులో అందుబాటులో ఉండగలను, కాబట్టి ముందుగా సంప్రదించి వికీపీడియన్లు అక్కడ కలవవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 05:37, 15 మే 2018 (UTC)

హైదరాబాదులో గతనెలలో నేను ఉండగా ఎవరినీ కలవలేకపోయాను. మా సొంత ఇల్లు గచ్చిబౌలిలోని మాగ్నం ఓపన్ నందు వచ్చినప్పుడు ఉంటాను. మా చెల్లలు సొంత ఇల్లు కూడా అక్కడే ఎదురు బజారులో ఉంది. ఈ సారి మాత్రం తప్పకుండా కలుస్తాను.JVRKPRASAD (చర్చ) 05:43, 15 మే 2018 (UTC)

"ప్రాజెక్టు టైగర్ - ఎడిట్ ఎ థాన్" సమావేశం[మార్చు]

అందరికి నమస్కారం. భారతీయ భాషలలో వ్యాసాల అభివృద్ధికి వికీపీడియా "ప్రాజెక్టు టైగర్" పేరుతో గత మూడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని భారతదేశం వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఎడిట్ ఎ థాన్ నిర్వహిస్తే బావుంటుందనే నా ఆలోచనకు పవన్ సంతోష్‌ గారూ తోడ్పాటును ఇస్తూ, వేదికగా తన నివాసాన్ని ఉపయోగించుకోవచ్చని తన సమ్మతిని తెలిపారు. అదేకాక, తన నివాసనమునందు స్వంతంగా ఏర్పాటుచేసుకున్న చిన్న గ్రంథాలయాన్ని ఆరోజు వ్యాసాల అభివృద్ధికి వాడుకోవచ్చని తెలిపారు. కావున సభ్యులు తేదీః 20 మే, 2018 ఆదివారం రోజున, సమయం మధ్యాహ్నం 3 గం. నుండి 6 గం. వరకూ కూకట్‌పల్లి భాగ్యనగర్ ఫేజ్.3లోని హైటెన్షన్ రోడ్డు సమీపంలో పవన్ సంతోష్ గారి నివాసంలో జరిగే ఈ కార్యశాలకూ హాజరుకాగలరని మనవి. పాల్గొనదలిచినవారు ముందుగా 9705658896కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. --Ajaybanbi (చర్చ) 13:02, 18 మే 2018 (UTC)

ధన్యవాదాలు Ajaybanbi... ఎడిట్ ఎ థాన్ నిర్వాహణ మంచి ఆలోచన. ఎడిట్ ఎ థాన్ ద్వారా ఎక్కువ మొత్తంలో వ్యాసాలను అభివృద్ధి చేసే ఆస్కారం ఉంటుంది. తప్పకుండా వస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:36, 19 మే 2018 (UTC)
అజయ్ గారూ మీ ఉత్సాహానికి చాలా సంతోషం. కార్యక్రమానికి, భవిష్యత్తులో తెవికీపీడియా అభివృద్ధికి మీరు తలపెట్టే కార్యక్రమాలకు నా వంతు సహాయం ఎప్పుడూ లభిస్తుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 09:19, 19 మే 2018 (UTC)

"ప్రాజెక్టు టైగర్" పోటీ చివరి ఎడిటథాన్ సమావేశం[మార్చు]

అందరికి నమస్కారం. భారతీయ భాషలలో వ్యాసాల అభివృద్ధికి వికీపీడియా "ప్రాజెక్టు టైగర్" పేరుతో నెలసరి పోటీలు గత మూడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని భారతదేశం వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయము విధితమే. ఇందులో భాగంగా పవన్ సంతోష్ గారి సహాయంతో ఎడిట్ ఎ థాన్ నిర్వహిణకు సన్నాహాలు చేసాము. తెలుగు వికీపీడియా సహా పలు భారతీయ భాషల వికీపీడియాలో జరుగుతున్న ఈ పోటీ ఈ శనివారం (మే 26) సాయంత్రం 5-7 గంటల్లో బంజార హిల్స్‌లో ఉన్న లమాకాన్‌లో జరుగుతుంది. ప్రాజెక్టు టైగర్ పోటీలో ఆఖరి నెల, చివరి వారం కనుక అందరూ వచ్చి, వ్యాసాలు రాయాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమం మీటప్‌.కాం అనే చోట ప్రచురణ చేసాము. అందులో ఉన్న తోటి వికిపీడియన్లకు (తెలుగు వారికి మరియు తెలుగు కాని వారికి కూడా) ఈ క్రింది లంకెను పంపండి,

http://meetu.ps/e/FkxkX/yTfmH/d

చిరునామా: Lamakaan Off Road No. 1, Banjara Hills, Opposite GVK One, Green Valley, Banjara Hills, Hyderabad, Telangana 500034 https://goo.gl/maps/fqVCEBzJ21U2

--Bhavabhuthi (చర్చ) 11:43, 24 మే 2018 (UTC)

నేను లమకాన్ లో ఉన్నాను , ఇక్కడ ఏ వికీపీడియన్ లేరు 😞 . కశ్యప్

కొన్ని వ్యాసాలు, విషయ ప్రాముఖ్యత[మార్చు]

ఈ మధ్య నేను తెలుగు వికీకి విషయ ప్రాముఖ్యత లేని కొన్ని వ్యాసాలను చూపించి తొలగింపు ప్రతిపాదన చేశాను. ఉదాహరణకు టిమోన్ మరియు పుంబా, డ్రాగన్ బాల్ జి. ఈ వ్యాసాలు ప్రారంభించిన సభ్యులు వాడుకరి:IM3847 ఇవి తప్పనిసరిగా ఉండాల్సిన వ్యాసాల జాబితాలో ఉన్నాయంటున్నారు. నాకైతే ఈ వ్యాసాలు అంతగా ప్రాముఖ్యత లేదని అనిపిస్తున్నది. మిగతా సభ్యులు తమ స్పందన తెలియజేయగలరు. పవన్ రవిచంద్ర (చర్చ) 06:20, 28 మే 2018 (UTC)

రవిచంద్ర గారూ! ఇవి గత పదేళ్ళ నుంచి తెలుగు పిల్లలకు బాగానే పరిచయం ఉన్న కార్యక్రమాలండీ. కాకుంటే మన తెలుగువారి మీద ప్రభావం చూపుతున్న కార్యక్రమాలకు కూడా తెలుగులో ఏ పత్రికలోనూ ప్రస్తావన ఉండకపోవచ్చు. కానీ వీటికి తెలుగునాట మంచి ప్రజాదరణే ఉంది. కాబట్టి ఇవి విషయ ప్రాముఖ్యత ఉన్నవనే నా అంచనా. --పవన్ సంతోష్ (చర్చ) 10:26, 28 మే 2018 (UTC)
తొలగింపు మూస తీసివేశాను. రవిచంద్ర (చర్చ) 11:42, 28 మే 2018 (UTC)

సమూహంలో ఉత్సాహ లోపం[మార్చు]

గత కొంత కాలంగా వికీ సమూహంలో కలయికలు లేదా సమావేశాలు వంటివి లేవు. మంత్లీ మీట్స్‌లో కూడా కొంత స్దబ్దత ఉన్నది. దాదాపు సంవత్సర కాలంగా వికీమిత్రుల సరియైన కలయిక జరగలేదు. మునుపు జరిగినట్టుగా ఉత్సవం వంటి ఒక సమావేశం నిర్వహిస్తే బావుంటుంది. దీనిని ఫక్తు ట్రైనింగ్, ఎడిటధాన్ లేదా క్లాసు లానో కాక కొంత భిన్నంగా నిర్వహిస్తే మరో సారి వికీమిత్రులకు కొంత ఆట విడుపుగా ఉంటుంది. తద్వారా మరికొంత ఉత్సాహంగా వికీ రచనలో పాల్గొనే అవకాశం ఉండవచ్చు అని నా అభిప్రాయం..B.K.Viswanadh (చర్చ)

పైన తెలుగు_వికీపీడియా_దశ-దిశ_కాన్ఫరెన్సు_ప్రతిపాదనలో ట్రైనింగ్, ఎడిటథాన్ కాక తెవికీలో జరిగిన కృషిని తెవికీపీడియన్లు స్వయంగా వివరించడం, తెలుగు సాహిత్యపరులు, శాస్త్ర నిపుణులు, సంపాదకులు వగైరా వచ్చి మనతో చర్చలు జరపడం వంటివి దీనిలో భాగం. కేవలం ఇలా మదింపుకే ఒక పూర్తి కాన్ఫరెన్సు జరపడం వినూత్నమే కాక మనం చేసిన పనిని ప్రపంచం ఎలా చూస్తోందన్న విషయం ఆసక్తిదాయకంగా కూడా ఉండగలదు. తెవికీపీడియన్లను ఒకచోట పోగుచేసి, బయటివారిని, వారిలో వారిని కలిపి, జరిగిన పనిని ఇష్టంగా, సంతోషకరంగా చెప్పుకుని, భవిష్యత్తులో ఏమేం చేయవచ్చో ఆలోచించుకునే ఈ ప్రయత్నం ఉత్సాహపూరితంగా ఉంటుందని భావిస్తూ మీ అభిప్రాయాన్ని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:41, 29 మే 2018 (UTC)
మంచి ప్రయత్నం ముందుకు సాగండి.B.K.Viswanadh (చర్చ)

New Wikipedia Library Accounts Available Now (May 2018)[మార్చు]


Hello Wikimedians!

The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to research and tools as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials on the Library Card platform:

  • Rock's Backpages – Music articles and interviews from the 1950s onwards - 50 accounts
  • Invaluable – Database of more than 50 million auctions and over 500,000 artists - 15 accounts
  • Termsoup – Translation tool

Expansions

Many other partnerships with accounts available are listed on our partners page, including Baylor University Press, Loeb Classical Library, Cairn, Gale and Bloomsbury.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 18:03, 30 మే 2018 (UTC)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

వికీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ (డబ్ల్యుఏటీ) 2018[మార్చు]

వికీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లేక డబ్ల్యుఏటీ అన్నది ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జూన్ 29 నుంచి జూలై 1 (శుక్ర, శని, ఆదివారాలు) వరకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం. పాల్గొనేవారు 2018 జూన్ 28 సాయంత్రానికల్లా వేదికకు చేరుకోవాల్సివుంటుంది.
కార్యక్రమ లక్ష్యాలు ఇవి:

  • భారతీయ వికీపీడియన్ల నైపుణ్యాలు వారి కృషికి అవసరమైనంతగా పెంపొందించడం
  • భారతీయ భాషల వికీపీడియాల్లో ప్రపంచవ్యాప్త ప్రాజెక్టుల ఉత్తమ పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసులు) ప్రవేశపెట్టడం.
  • #1Lib1Ref, ద వికీపీడియా లైబ్రరీ వంటి కార్యక్రమాల గురించిన అవగాహన, స్క్రిప్టులు, గాడ్జెట్లు, వికీమీడియా ఉపకరణాలు వంటివాటి వాడకం పెంపొందించడం.
  • గ్లోబల్ హాకథాన్, వికీడాటాకాన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి తగ్గ విధంగా బారతీయ వికీమీడియన్లలో సామర్థ్యం పెంపొందించడం.

కార్యశాల గురించి, పాల్గొనడానికి అవసరమైన ఇతర అంశాల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ లంకెను సందర్శించండి: http://meta.wikimedia.org/wiki/CIS-A2K/Events/Wiki_Advanced_Training

జూన్ 9 తేదీ దరఖాస్తులకు ఆఖరు తేదీ. ఏదైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే దయచేసి అడగగలరు.

ధన్యవాదాలతో,
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:03, 1 జూన్ 2018 (UTC)

రాంచీ స్థానికుడు, వికీపీడియన్ బదాని ఇటీవల మరణించారు. ఆయన వికీమీడియా ప్రాజెక్టులకు అద్భుతమైన కృషి చేసిన వ్యక్తి. కార్యశాల అనంతరం సాయంత్రం పూట ఆయనకు నివాళి అర్పిస్తారు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:35, 1 జూన్ 2018 (UTC)

తెలుగు వికీపీడియా నాణ్యతాభివృద్ధి కార్యశాల[మార్చు]

అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియాలో ఇప్పటికే విపులమైన చర్చల ఆధారంగా రూపొందించుకున్న విధానాలు, మార్గదర్శకాల అమలు కోసం, వ్యాసరచనలో వికీశైలి, ఆధునిక తెలుగు భాషా శైలి ప్రతిఫలించేందుకు ప్రత్యేకించి ఒక కార్యశాల నిర్వహించాలని ప్రతిపాదన. ఇప్పటికే ఉన్న శైలీ మార్గదర్శకాలు, విధానాలను పాల్గొన్న సభ్యులకు వివరిస్తూ, వాటి అమలులోని లోటుపాట్లు, వాటిని సవరించేందుకు అవసరమైన ఉపకరణాలు వంటి అంశాలు వివరించడం, పూర్తిస్థాయి శైలి రూపొందించుకునేందుకు లోటుగా ఉన్నదేమిటన్నది చర్చించడం, సభ్యుల్లో ఒక్కొకరూ 10-15 ప్రదర్శిత వ్యాసాల్లో నాణ్యతాపరంగా సమీక్షించి లోటుంటే నిర్వహణా మూసలు చేర్చడం, లేకుంటే వ్యాసం చర్చలో ఆ మేరకు రాయడం, ఆయా వ్యాసాలలో గట్టి కృషిచేసినవారి దృష్టికి నాణ్యతాలోపాలు తీసుకుపోవడం వంటి కార్యకలాపాలు దీనిలో ప్రతిపాదిస్తున్నాం. దయచేసి కార్యక్రమ పేజీని సందర్శించి అభిప్రాయాలు, సూచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:47, 4 జూన్ 2018 (UTC)

ప్రాజెక్టు టైగర్ పోటీ[మార్చు]

ఇది అనువదించిన పోస్టు
ఫాం ఇంకా నింపని ప్రాజెక్టు టైగర్ పోటీ విజేతలు, దయచేసి 15 జూన్ 2018 నాటికి నింపగలరు. ఆ తర్వాత బహుమతి పంపడానికి వీలుండదు. ఇప్పటికే నింపినవారు, మరోసారి నింపనక్కరలేదు. ధన్యవాదాలతో --Gopala Krishna A (చర్చ) 05:42, 8 జూన్ 2018 (UTC)

విజేతల వివరాలు, సూచనలు[మార్చు]

గత మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్టు టైగర్ పోటీలో భాగంగా తెలుగులో గెలుపొందిన వారి వివరాలు ఇక్కడ ప్రకటించాం. తెలుగు వికీపీడియా వ్యాసాలను, శైలిని మెరుగుపరిచిన ఈ ప్రయత్నంలో పాల్గొన్నవారికి, గెలుపొందినవారికి అభినందనలు. ఈ పోటీల్లో గెలుపొందినవారు దయచేసి పైన ఇచ్చిన ఫాం నింపగలరు. తెలుగులో క్యాష్ ప్రైజ్ బదులుగా పుస్తకాలు ఉండాలని సూచించడం తెలిసిందే కనుక ఫాంలో సూచించినట్టు అమెజాన్‌లో మీరు ఆశించే పుస్తకాలు ఉంటే సరి, లేదూ క్యాష్ ప్రైజ్ రూపంలో తీసుకుని మీకు నచ్చిన పుస్తకాలు బయటే కొనుక్కోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 13:41, 12 జూన్ 2018 (UTC)

Wikigraphists Bootcamp (2018 India): Applications are open[మార్చు]

Wikigraphists Bootcamp (2018 India) to be tentatively held in the last weekend of September 2018. This is going to be a three-day training workshop to equip the participants with the skills to create illustrations and digital drawings in SVG format, using software like Inkscape.

Minimum eligibility criteria to participate is as below:

  • Active Wikimedians from India contributing to any Indic language Wikimedia projects.
  • At least 1,500 global edits till 30 May 2018.
  • At least 500 edits to home-Wikipedia (excluding User-space).

Please apply at the following link before 16th June 2018: Wikigraphists Bootcamp (2018 India) Scholarships.

MediaWiki message delivery (చర్చ) 11:12, 12 జూన్ 2018 (UTC)

Wiki Loves Yerevan International edit-a-thon[మార్చు]

Wikimedia Armenia logo.svg

For the purpose of increasing the number of Yerevan related content in the Internet, Wikimedia Armenia announces international one-month edit-a-thon from June 15 – July 15, 2018. You are kindly invited to get involved and start editing and improving articles about Yerevan.

Hope you'll enjoy editing and have fun during this interesting process.

One participant from the first 15 most written language Wikipedias with the most points will be invited to Yerevan to join the events organized in the frames of Yerevan 2800th anniversary. For more details please visit the edit-a-thon page on Meta.

See you soon in sunny Yerevan!--Lilit (WM AM) (చర్చ) 12:04, 14 జూన్ 2018 (UTC)

ఈ పోటీలో నాకు ఎవరైనా సహాయము చేయగలరా? నేను ఇప్పటివరకు 30 వ్యాసాలను అనువధించాను, వ్యక్తిగతంగా ప్రపంచంలో 2/3 స్థానాలలో ఉన్నా వికీ-కమ్యునిటీల ప్రకారం చూస్తే తెలుగు వికీపీడియా వెనుకబడి ఉన్నది. మిగతా సభ్యులు రోజుకు ఒక్క వ్యసాన్ని తయారు చేసినా ఎంతో ఉపయోగపడుతుంది. వివరాలను [1] ఇక్కడ చూడవచ్చు. 15:44, 26 జూన్ 2018‎ IM3847 (చర్చ | రచనలు | నిరోధించు)

జులై 1, 2018 సమావేశం[మార్చు]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జులై 1, 2018 సమావేశం చూసి దాని చర్చాపేజీలో స్పందించండి.--అర్జున (చర్చ) 06:31, 5 జూలై 2018 (UTC)

అన్నమయ్య గ్రంథాలయం, స్వేచ్ఛ కార్యాలయాల్లో సెషన్లు[మార్చు]

అందరికీ నమస్కారం,
అన్నమయ్య గ్రంథాలయం, స్వేచ్ఛ పలు స్థాయిల్లో తెలుగు వికీపీడియా కార్యకలాపాలకు సంస్థాగతంగా సహకరించిన విషయం తెలిసిందే. ఈ సంస్థల్లో రెండు పరిచయ సెషన్లు నిర్వహిస్తున్నాం.

  • అన్నమయ్య గ్రంథాలయంలో వారి గ్రంథాలయ జాబితాను పూర్తిస్థాయిలో వికీపీడియాలో చేర్చగలగడానికి అవసరమైన శిక్షణను ఇవ్వమని కోరారు. వారి స్టాఫ్‌కి జూలై 8వ తేదీ, మంగళవారం నాడు గుంటూరులో వారి వద్ద ఉన్న ఎక్సెల్ షీట్లలో డేటాను వికీపీడియాలో మార్కప్ కోడ్ టేబుల్స్‌గా మలచడానికి ఉపకరించే ఉపకరణాలు, ఏయే పేజీల్లో ప్రచురించాలి అన్న విషయాలు నేర్పనున్నాను. వీటితో పాటు ఆ పుస్తకాల గురించి వికీడేటా క్విక్ స్టేట్‌మెంట్స్ వాడి వికీడేటా ఐటమ్స్ తయారుచేయవచ్చన్న ఆలోచనను వారితో పంచుకుని ఆ విషయంపై ప్రగతికి ప్రయత్నిస్తాను. గ్రంథాలయంలో వికీసోర్సుకు అవసరమైన, పేజీలు మిస్సైన పుస్తకాలు వెతికి స్కాన్ చేసి చేర్చే ప్రయత్నమూ జరుగుతుంది.
  • స్వేచ్ఛ సంస్థ వారు రంగారెడ్డి జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల వివరాలను వికీడేటా ఐటమ్స్‌గా చేర్చే ప్రయత్నంలో ఉన్నందున దీనిని మరింత వేగవంతంగా మెరుగ్గా చేయగల ఉపకరణాల గురించి నేర్పమని కోరారు. కాబట్టి వారికి ఆ అంశాల్లో మౌలిక శిక్షణ 2018 జూలై 15, ఆదివారం నాడు అందించనున్నాం.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 11:02, 9 జూలై 2018 (UTC)

వికీపీడియా నాణ్యతాభివృద్ధి[మార్చు]

జులై 1, 2018 సమావేశం చర్చల పర్యవసానంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ లో భాగంగా నాణ్యత తనిఖీ జాబితాను అభివృద్ధి పరచి అమలుచేయాలని సూచించబడింది. ఆంగ్ల వికీపీడియాలోని ఒక జాబితాని తెలుగులోకి మార్చి, రాబోవు ఈ వారం వ్యాసాల చర్చ పేజీలకు కేశవ శంకర్ పిళ్ళై,తుర్లపాటి కుటుంబరావు, లాల్ బహాదుర్ శాస్త్రి,కాళోజీ నారాయణరావు జత చేశాను. ఆసక్తి గల సభ్యుల ఈ చర్చలలో పాల్గొని వ్యాసాల్ని అభివృద్ధిచేయవలసింది.--అర్జున (చర్చ) 11:05, 9 జూలై 2018 (UTC)

అర్జున గారూ, విశేష/ఈవారం వ్యాసాల ప్రమాణాలు మరింత విస్తృతంగా మరింత సమగ్రంగా ఉంటాయి. మన వ్యాసాల ప్రస్తుత నాణ్యత, మనకున్న పరిమిత వనరుల దృష్ట్యా, మన వ్యాసాలు ముందుగా "మంచి వ్యాసాల" ప్రమాణాలను అందుకునేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 01:58, 10 జూలై 2018 (UTC)
చదువరి గారి స్పందనకు ధన్యవాదాలు. దీనిలోని విభాగాలలో కొన్ని కుదించవచ్చు. ఈ చిట్టా పూర్తిగా వాడాలి అనే ఆంక్ష లేకుండా వాడితే కొన్నాళ్లకు విశేష వ్యాసాల స్థాయికి చేరుకోవచ్చు అని నా అభిప్రాయం. మొదట సభ్యులు కొంత సమయం సమిష్టిగా వ్యాసం మెరుగు చేయటానికి కృషి చేయటం చాలా ముఖ్యం. అలా కొన్నాళ్లు పోయిన తర్వాత జాబితా ని కుదించవచ్చు. అలాకాకుండా మీరు మీ ప్రాజెక్టు టైగర్ అనుభవాన్ని బట్టి వేరే జాబితాని ప్రతిపాదించినా మంచిదే.--అర్జున (చర్చ) 05:59, 10 జూలై 2018 (UTC)
అర్జున గారూ, "మొదట సభ్యులు కొంత సమయం సమిష్టిగా వ్యాసం మెరుగు చేయటానికి కృషి చేయటం చాలా ముఖ్యం." ఈ విషయంలో నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తాను. ప్రస్తుతానికి "విశేష" వ్యాసాల కోసం కాకుండా "మంచి" వ్యాసాల కోసం ఒక ప్రమాణాల జాబితా చేసుకుందామనే నా ఉద్దేశం కూడాను. వాడుకరి:Pavan santhosh.s గారు మొదలు పెట్టిన వికీపీడియా:మంచివ్యాసం ప్రమాణాలు పేజీ చూడండి. అక్కడ మీ ఆలోచనలను చేర్చండి. సముదాయం అభిప్రాయాలు తీసుకొన్న తరువాత వ్యాసాల మెరుగుదలకు పని మొదలు పెట్టవచ్చు. __చదువరి (చర్చరచనలు) 06:12, 10 జూలై 2018 (UTC)
చదువరి ప్రమాణాలు పేజీ బాగానేవుంది. దానికి తగ్గట్టుగా నాణ్యత తనిఖీ జాబితాని కుదించి వాడుకోవచ్చు.--అర్జున (చర్చ) 03:52, 11 జూలై 2018 (UTC)

Global preferences are available[మార్చు]

19:20, 10 జూలై 2018 (UTC)

విశ్వసనీయ మూలాలు[మార్చు]

వికీపీడియా మౌలిక నియమాల్లో ఒకటైన మూలాలను ఉదహరించడం అనే విషయమై కొత్తవారికి తెలియజేసేందుకు పవన్ సంతోష్ గారు వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు అనే ఒక వ్యాసాన్ని తయారుచేసారు. వాడుకరులంతా దీన్ని చూసి అభిప్రాయాలు, సూచనలు ఏమైనా ఉంటే దాని చర్చాపేజీలో తెలుపగలరు. __చదువరి (చర్చరచనలు) 07:26, 13 జూలై 2018 (UTC)

అర్జునరావు, రవిచంద్ర, స్వరలాసిక, మీనాగాయత్రి, ప్రణయ్ రాజ్ గార్లు, ఇంకా నేను ప్రస్తావించడం మరచిపోయిన ఇతర వికీపీడియన్లు దయచేసి ఈ పేజీ సందర్శించి తమ తమ అభిప్రాయాలు, పరిశీలనలు చెప్పాలని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:43, 15 జూలై 2018 (UTC)
పవన్ సంతోష్, పరిశీలించి నా అభిప్రాయాలు తెలియజేస్తాను. రవిచంద్ర (చర్చ) 05:02, 16 జూలై 2018 (UTC)